విజయవాడలో వంద కేజీల గంజాయి పట్టివేత
అక్రమ రావాణాపై పోలీసుల దృష్టి
విజయవాడ,సెప్టెంబర్4(జనం సాక్షి): గంజాయి రవాణాకు విజయవాడ కేంద్రంగా మారుతోంది. తాజాగా బెంజిసర్కిల్‌లో 100 కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం విశాఖ నుంచి చెన్నైకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం అందటంతో బెంజి సర్కిల్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో రవాణా చేస్తున్న 100 కేజీల గంజాయిని గుర్తించి కారుతో సహా స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని సరఫరా చేసినందుకు నిందితులకు రూ.10వేల కమిషన్ అందుతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ గంజాయిని ఎవరు పంపుతున్నారు ? ఎవరికి సరుకు ఇస్తున్నారు అనే కోణంలో నిందితులను విచారిస్తున్నారు. విజయవాడ విూదుగా నిత్యం కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి తరలిస్తున్నారు. పోలీసులు ,డీఆర్‌ఐ అధికారులు దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేస్తున్నా రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. దీనిని అడ్డుకునేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పోలీసులు కోరుతున్నారు.
—————