విజయ్‌కాంత్‌కు షాక్‌

1

– 10మంది ఎమ్మెల్యేల రాజీనామా

తమిళనాడు,ఫిబ్రవరి 21(జనంసాక్షి):తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల సవిూపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. సినీ నటుడు విజయకాంత్‌ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సొంత పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను ఆమోదిస్తున్నట్టు స్పీకర్‌ ధనపాల్‌ వెల్లడించారు. దీంతో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ ప్రతిపక్షనేత ¬దాను కోల్పోయినట్లు స్పీకర్‌ ప్రకటించారు.  రాజీనామా చేసిన వారిలో 8 మంది డీఎండీకే ఎమ్మెల్యేలు, ఇద్దరు ఉన్నారు. ఇప్పటివరకూ ఆయన నిర్ణయం కోసం అనేక పార్టీలు కూటమి కోసం ఎదురు చూస్తున్నాయి. కెప్టెన్‌ నిర్ణయం కోసమే కూటమి ఏర్పాటులో జాప్యం ఏర్పడుతోంది. రాష్ట్ర అసెంబ్లీకి మే నెలలో ఎన్నికలు జరుగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల కమిషన్‌ అధికారులు ఎలక్షన్‌ నిర్వహణపై పనులు ప్రారంభించారు.  కాంచీపురంలో మహానాడు ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ సతీమణి ప్రేమలత విలేకరులతో మాట్లాడుతూ.. ఎంజీఆర్‌ వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని, అలా సీఎం జయలలిత ఎందుకు కాలేకపోయారంటూ ప్రశ్నించారు. సీఎం జయలలిత 234 స్థానాలకు నేరుగా అభ్యర్థులను ప్రకటించగలరా? అంటూ బహిరంగ సవాల్‌ విసిరిన నేపథ్యంలోనే కెప్టెన్‌ విజయకాంత్‌ తన ప్రతిపక్షనేత ¬దాను కోల్పోయారు.

విజయ్‌కాంత్‌ ఇక ప్రతిపక్ష నాయకుడు కాదు..!

చెన్నై: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తుండగా తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి ¬దాను కోల్పోయారు. అసమ్మతితో ఆ పార్టీకి చెందిన 8 మంది, పుదియ తమిళగం, పీఎంకే పార్టీలకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే అందజేసిన రాజీనామాలను స్పీకర్‌ ధనపాల్‌ ఆమోదించారు. దీంతో విజయ్‌కాంత్‌ ప్రతిపక్ష నాయకుడి ¬దా కోల్పోయారని స్పీకర్‌ ధనపాల్‌ ఆదివారం ప్రకటించారు.