విజయ్‌ను వదలిపెట్టిన పోలీసులు

7  

కొత్తగూడెం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ సభలో నిరసన తెలిపిన ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ని పోలీసులు ఎట్టకేలకు విడుదల చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం వద్ద అతడిని గురువారం పోలీసులు విడిచిపెట్టారు. మావోయిస్టులతో విజయ్ కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విజయ్ వద్ద హామీ పత్రం తీసుకున్నట్లు సమాచారం. కాగా విజయ్ స్వస్థలం కరీంనగర్ జిల్లా వేములవాడ.