విటిపిఎస్‌లో తలెత్తిన సాంకేతిక లోపం
విజయవాడ, జూలై 20: విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (విటిపిఎస్) మొదటి యూనిట్లో శుక్రవారం నాడు సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. టర్బైన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా యూనిట్ మొరాయించింది. సాంకేతిక నిపుణులకు సమాచారం అందించారు. 24గంటల తరువాతే యూనిట్‌ను పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని ప్లాంట్ వర్గాలు తెలిపాయి.