విత్తన ఎంపిక,సేంద్రీయ ఎరువులు వాడకం తో అధిక దిగుబడులు.
మండల వ్యవసాయాధికారి సాయి రమేష్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 16(జనంసాక్షి):
రైతులు విత్తన ఎంపికలో మెళకువలు పాటించటం ముఖ్యమని తాడూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి జి.సాయిరమేష్ పేర్కొన్నారు.శుక్రవారం మండల పరిధిలోని యాదిరెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో రైతు బొడ్డుపల్లి శ్రీశైలం సాగు చేసిన కర్షక్ సీడ్స్ కంపెనీ సూపర్ వైట్ బీజి 2 ప్రత్తి పంట క్షేత్ర ప్రదర్శన,రైతు సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ రైతులు ప్రస్తుత కాలంలో రసాయన ఎరువులు తగ్గించి,సూక్ష్మ పోషకాలు,సేంద్రీయఎరువులువాడకంతో అధిక దిగుబడులుసాధించవచ్చునని,అదే విధంగా విత్తనాలు,పురుగుమందుల వాడకం లో నాణ్యమైన వాటినే ఎంచు కోవాలన్నారు, గ్రామ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ అత్యధికంగా ఇప్పటికే 90పెద్ద సైజు కాయలు ఉన్న ప్రత్తి పొలం ఇదేనన్నారు.రైతు బొడ్డుపల్లి శ్రీశైలం మాట్లాడుతూ తాను 1.50 సెంట్ల భూమి పైన రెండు ప్యాకెట్లు సూపర్ వైట్ పత్తి గింజలు పెట్టానని,ఇప్పటి వరకు రెండు సార్లు ఫర్టిలైజర్, నాలుగు సార్లు పురుగు మందుల స్ప్రేయింగ్ లు ఇచ్చామన్నారు. ఒక్కో చెట్టుకు సగటున 80నుండి 90 పెద్ద కాయలు ఉన్నాయని ,ఎకరాకు 20క్వింటాళ్ల వరకు దిగుబడి ఇచ్చే అవకాశం ఉందని అన్నారు,కంపెనీ మేనేజర్ నందిగం కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ కంపెనీ రైతులకు నాణ్యమైన ప్రత్తి, హైబ్రిడ్ మిరప, పరిశోధన మిరప,వరి,మొక్కజొన్న,సోయా, కూరగాయల విత్తనాలు అందిస్తున్నా మన్నారు. కార్యక్రమం లో ఉప సర్పంచ్ ఆంజనేయులు,నాగర్ కర్నూల్ మహాలక్ష్మి సీడ్స్ బాలరాజు,కంపెనీ ప్రతినిధులు కె. పర్వతాలు, జె.రతన్ సింగ్, రామకృష్ణ, తాడూరు, నాగర్ కర్నూల్, బిజినపల్లి, కల్వకుర్తి,అచ్చంపేట, తెల్కపల్లి, మండలాల పరిధిలోని పలు గ్రామాల నుంచి సుమారు రెండు వందల మంది రైతులు,25మంది డిస్ట్రిబ్యూటర్లు,డీలర్లు పాల్గొన్నారు.