విద్యతోపాటు క్రీడల పట్ల ప్రతి విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 29 (జనం సాక్షి);

విద్యతోపాటు క్రీడల పట్ల ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు ఆసక్తితో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.మంగళవారం థరూర్ మండల కేంద్రంలోని ఎంపీపీ ఎస్, జడ్పీ హైస్కూల్, రేవులపల్లి ఉన్నత పాఠశాలలను సందర్శించి మన ఊరు మనబడి క్రింద నిర్మించిన నిర్మాణాలను పరిశీలించారు. కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్ ,మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఎస్ పాఠశాలలో విద్యార్థులతో మమేకమై ఐదవ తరగతి విద్యార్థినిలతో ఇంగ్లీష్ పాఠం చదివించారు. సిలబస్ ప్రకారంగా బోధించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. జడ్పీ హైస్కూల్లో జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులు పరిశీలించి ఎంతమంది హాజరయ్యారని ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం క్రీడలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తుందని, చదువుతో పాటు క్రీడలలో పాల్గొనేల చూడాలని , చిన్న తనం నుండే క్రీడల వైపు ప్రోత్సహించి నైపుణ్యం కలిగిన క్రిడాకరులుగా తీర్చిదిద్దాలని , ప్రతి విద్యార్థి క్రీడలలో రాణించి మంచి పేరు సంపాదించుకోవాలని అన్నారు. అనంతరం రేవులపల్లి జడ్పీ హైస్కూల్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎం ఇ ఓ సురేష్, డి ఈ రాజేష్, హెడ్మాస్టర్ జ్యోత్స్న, హై స్కూల్ హెడ్మాస్టర్ ప్రతాపరెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.