విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి- తపస్ డిమాండ్

దండేపల్లి. జనంసాక్షి.25 ఆగస్టు . దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్ డిమాండ్ చేశారు గురువారం దండేపల్లి మండలంలోని పలు పాఠశాలల్లో TPUS సభ్యత్వ నమోదు ప్రారంభించిన అనంతరం వివిధ సమస్యలపై మాట్లాడడం జరిగింది ఉపాధ్యాయులు అనేక సంవత్సరాలుగా పదోన్నతులు లేకుండా ఒకే క్యాడర్లోనే రిటైర్ అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే పదోన్నతులు మరియు బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు అలాగే పాఠశాలకు తప్పనిసరిగా అవసరం ఉన్న స్కావెంజర్లను తొలగించడం దారుణం అని అన్నారు తొలగించిన స్కావెంజర్లను ప్రభుత్వం వెంటనే నియమించాలని కోరారు అలాగే వివిధ రకాల పెండింగ్ బిల్లులను కాలయాపన లేకుండా తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షులు నీలేష్ కుమార్ కాచువాల్ మండల నాయకులు ఉప్పల రూపా చారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు