విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం బంద్
మహబూబ్ నగర్,జూలై5(జనం సాక్షి): రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లాలో విద్యాసంస్థలను మూసేయించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్య సంస్థలు బంద్ నిర్వహించారు. జిల్లా నాయకులు వెంకట్ మాట్లాడుతూ ప్రవేటు విద్య సంస్థలో ఫిజు నియంత్రణ చటట్‌ం తీసికొని రావాలని దశలవారీగా పోరాటాలు చేస్తున్న ఈ ప్రభుత్వవాలు నిమ్మకు నీరెత్తినటు వేవాహరిస్తున్నాయని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వా కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని వెంటనే చేపట్టాలని అన్నారు. ఖాలీగా ఉన్న లెక్చరర్, ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలన్నారు. సంక్షేమ హస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించాలన్నారు. అదేవిధంగా మౌళికవస్తులు కల్పించాలన్నారు. అలాగే ఖాళీగా ఉన్న విద్యావలేంటర్ పోస్టులను వెంటలని బర్తిచేయలని కోరుతూ ఈ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించని ఎడలదశాలవారి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.