విద్యార్తినిల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి-ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 2. (జనంసాక్షి). విద్యార్తినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రశాంత్ మాట్లాడుతు గత వారం రోజులుగా విద్యార్థులపై వేధింపులు ఒకటి మరువక ముందే మరొకటి జరుగుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కీచకంగా మారి ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
అక్షర జ్ఞానం అందించి అందరిలో మిన్నగా భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు కొందరు పెడదారిలో వెళ్తూ ఉపాధ్యాయ వృత్తికి అపవాది తీసుకొస్తున్నారని ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగడం సిగ్గుచేటని అన్నారు
వేములవాడ, తంగలపల్లి మండలాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉండడం, వీటన్నిటికీ కారణం పాఠశాలలో సరి అయిన పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణమని అన్నారు జిల్లాలో 13 మండలాలకు గాను రెగ్యులర్ ఎంఈఓ లేకపోవడం వల్ల పర్యవేక్షణ కరువైపోయిందని ఇన్చార్జి పాలనలో విద్యావ్యవస్థ నడవడం ద్వారానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయ ని వెంటనే మంత్రి గారు జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకొలాని డిమాండ్ చేశారు.
లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించి సస్పెండ్ చేయాలని అన్నారు.
సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్,ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్, గుండెల్ని కళ్యాణ్ కుమార్, సహాయ కార్యదర్శి సొల్లు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు