విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ.
పాఠశాలలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్24(జనంసాక్షి):
2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థు లందరికీ ఏకరూప దుస్తులను పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురా లు జి.జ్యోతి తెలిపారు.శనివారం నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండల పరిధిలోని ఆకునెల్లికుదురు గ్రామపంచాయతీ ఆవరణ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు.సమావేశ అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచి కృష్ణవేణి ప్రారంభించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు జి.జ్యోతి మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న 32 మంది విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రెండు జతల ఉచిత ఏకరూప దుస్తులను అందజేసినట్లు తెలిపారు.ప్రతి విద్యార్థి ఏకరూప యూనిఫామ్ దుస్తుల ధారణతో పాఠశాలకు రావాలని,పాఠశాల విద్య ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలని ఆమె కోరారు.
పాఠశాలలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా నిర్వహించబడుతున్న సందర్భంగా తాడూరు మండల పరిధిలోని ఆకునెల్లికుదురు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బతకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో బతుకమ్మను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు బొడ్డెమ్మలు, బతుకమ్మ పాటలు,సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సంబరాల సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.జ్యోతి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి,సాంప్రదాయా లకు ప్రతీకగా జరుపుకుంటారని తెలిపారు. ఈ పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అని తెలిపారు.ఈ కార్య క్రమంలో సర్పంచ్ కృష్ణవేణి,ఉపాధ్యాయుడు ఆంజనేయులు, విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ పెద్దలు,పాఠశాల సిబ్బంది అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.