విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించిన దౌల్తాబాద్ పోలీసులు.
దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి.
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి స్థానిక పాఠశాలల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు క్షుణ్ణంగా విధి నిర్వహణలో ప్రాణాల అర్పించిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ నిర్వహణ ఆయుధాల వినియోగం ఫిర్యాదులు ఎలా స్వీకరిస్తారో దానిపై దర్యాప్తు ఎలా కొనసాగిస్తారు, సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి అని వాటిపై వారికి వివరించారు.వాటిని నిరోధించడం ఎలా వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సాయిలు,హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు, కానిస్టేబుల్ స్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.