విద్యార్థులకు నాణ్యమైన వేడివేడి భోజనం అందించాలి.
ఏ టి డి ఓ కమలాకర్ రెడ్డి
లింగాల జనం సాక్షి ప్రతినిధి
విద్యార్థులకు వేడివేడి భోజనం అందించాలని ఏ టి డీ వో కమలాకర్ రెడ్డి అన్నారు. గురువారం నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండలం అప్పాయిపల్లి ఆశ్రమ బాలుర పాఠశాలను. లింగాల ఆశ్రమ బాలికల పాఠశాలలు వారు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల వర్షాలు కురుస్తున్న క్రమంలో విద్యార్థులకు ఎప్పటికప్పుడు వేడివేడి భోజనం అందించాలని, పాఠశాల ఆవరణలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వర్షపు నీరు ఎక్కడ కూడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. భోజనం వండేటప్పుడు వర్కర్స్ జాగ్రత్త పాటించాలని. ప్రతి పాఠశాలకు ఎ ఎన్ ఎం రిక్రూట్మెంట్ చేసుకుంటావని , ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లో మండల విద్యాశాఖ ద్వారా తీసుకున్నారని. కొన్ని సబ్జెక్టులకు పుస్తకాలు రాలేదని తెలిపారు. పాఠశాలలో ఉండే విద్యార్థులకు ఐటీడీఏ ద్వారా దుప్పట్లు బ్యాగులు గిరిదర్శినీ బుక్కులు అందించడం జరిగిందని అన్నారు. ఆగస్టు నెలలో విద్యార్థులకు విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చే విధంగా చూడాలని. అత్యవసరమైతే విద్యార్థులను ఇంటికి పంపించాలని. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని కోరారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల, ఉపాధ్యాయుల రిజిస్టర్ లను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాల అప్పాయిపల్లి పాఠశాలలో 50 మంది విద్యార్థులు నమోదు ఉండగా 40 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. పాఠశాల ప్రహరీ గోడ లేకపోవడం తో పాఠశాలలోకి పందులు కుక్కలు సంచరిస్తున్నాయి, పై అధికారుల దృష్టికి సమస్య తెలియజేసి పరిష్కరించాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతయ్య ఉపాధ్యాయులు లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.