విద్యార్థులకు విద్యాసామాగ్రిని పంపిణీ చేసిన ఎస్ ఆర్ ఆర్ ట్రస్ట్ అధినేత.
కృతజ్ఞతలు తెలిపిన పాఠశాలప్రధానోపాధ్యాయురాలు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై22(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల పరిధిలోని ఆకునెల్లికుదురు గ్రామ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు విద్యార్థులకు కావాల్సిన పెన్, పెన్సిల్,రబ్బర్, షార్ప్నర్,పౌచ్ తదితర వస్తువులను ఎస్ ఆర్ ఆర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఎస్.రామచంద్ర రావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత డాక్టర్ ఎస్.రామచంద్ర రావు మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సేవ చేయడం చాలా సంతృప్తిగా ఉందని అన్నారు.మా అమ్మ చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుందని, నాకు జన్మనిచ్చిన నా తల్లి రుణం తీర్చుకోవడానికి పేదరికంతో విద్యకు దూరమై పోతున్నవారికి సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించిన మా అమ్మకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.మానవసేవే మాధవసేవ అన్న సూక్తి మా అమ్మ నేర్పిందని,నేటి ప్రపంచంలో విద్య లేకపోతే కనీసం మనిషిగా కూడా చూడరని ఏ ఒక్కరు కూడా ఆర్థిక ఇబ్బందులతో కానీ,కనీస అవసరాలు లేవని విద్యకు దూరం కావద్దని,విద్య ద్వారానే అన్ని సాధించవచ్చునని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివి ఉన్న ఊరికి కన్న తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తేవాలని ఆశిస్తున్నామని అన్నారు. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు కానీ జ్ఞానాన్ని సంపాదించుకోలేమని జ్ఞానం కేవలం చదువుతోనే వస్తుందని ,అందుకే నేను హైదరాబాదు నుండి ఇంత దూరం వచ్చి మీకు చదువుకోవడానకి కావలసిన వస్తువులను పంపిణీ చేస్తున్నానని అన్నారు.నాకు ఇంతటి గొప్ప అవకాశం కలిగించిన పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు జి.జ్యోతి కి కృతజ్ఞతలు తెలుపుతూ, చిన్న సన్మానం చేస్తున్నామని అన్నారు. అనంతరం జి.జ్యోతి పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు మాట్లాడుతూ ఒక ఫోన్ కాల్ కు స్పందించి హైదరాబాదు నుండి ఇంత దూరం వచ్చి మా విద్యార్థుల కు విద్యాసామాగ్రిని అందజేసినందుకు వారి ట్రస్టుకు, మరియు ట్రస్టు అధినేత రామచంద్ర రావుకు మరియు వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాఠశాల తరఫున ట్రస్టు అధినేత కు చిరు సన్మానం చేసినట్లు తెలిపారు.ఎస్ ఆర్ ఆర్ ట్రస్టు ద్వారా మీరు చేస్తున్న సేవలను మరింత విస్తృతంగా చేయాలని,పేద విద్యార్థులకు మీ ట్రస్టు ద్వారా మరింత సేవలు అందాలని మనస్పూర్తిగా కోరుతున్నామని ఈ సందర్భంగా ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల స్విపర్ అంజమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.