విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేత
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 25(జనం సాక్షి)
లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో గురువారం రామన్నపేట హంటర్ రోడ్డు ఆర్యవైశ్య హైస్కూల్ విద్యార్థులకు లయన్ బరుపాటి నర్సింహారావు సహకారంతో స్కూల్ బ్యాగ్స్ అoదజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్ గడ్డం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు లయన్స్ ఎప్పుడు అండగా వుంటారనీ స్పోర్ట్స్ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు. స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు అప్పరాజు రాజు మాట్లాడుతూ స్పోర్ట్స్ క్లబ్ ద్వారా పేద మెడికల్ విద్యార్థులను చదివిస్తున్నామని మీరు కూడా బాగా చదువుకొని అభివృద్దిలోకి రావాలని విద్యార్ధులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు అప్పరాజు రాజు,ఉపాధ్యక్షులు ఉదయ భాస్కర్, రావుల భాను,కోశాధికారి గుండెటి రమణయ్య, జయింట్ సెక్రటరీ సురేందర్, సిoగ స్టీఫెన్, ఆపద్భాందు క్లబ్ అధ్యక్షుడు అడేపు రమేష్, వారియర్స్ క్లబ్ ప్రతినిధి గంగిశెట్టి హరినాథ్, స్కూల్ హెడ్ మాస్టర్ చారి, కరస్పాండెంట్ రాజేశ్వరరావు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.