విద్యార్థులలో సామర్ధ్యాలను పెంపొందించేలాబోధన చేయాలి

స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం జానకమ్మ

మల్దకల్ సెప్టెంబర్ 19 (జనంసాక్షి) జోగులంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం అమరవాయి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల కాంప్లెక్స్ ఐఇసి సమావేశం మంగంపేట ప్రాథమిక పాఠశాలలో సోమవారం నిర్వహించారు.ఈ సమావేశంలో తొలిమెట్టు ప్రోగ్రాంలో ఉపాధ్యాయులు తెలుగు,గణితం, ఇంగ్లీష్ ఈవీఎస్ సబ్జెక్టులలో ఆన్యువల్ ప్లాన్ యూనిట్ ప్లాన్ పీరియడ్ ప్లాన్ రాసే విధానాన్ని ఆర్పిలు సీతంనాయుడు,శ్రీకాంత్,శంకర్ నాయక్,హరిప్రియవివరించారు. విద్యార్థులలో సామర్థ్యాలను పెంపొందించేలా బోధన చేయాలని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు జానకమ్మ సూచించారు.జిల్లా ఐఇసి నోడల్ ఆఫీసర్ నరేష్ మాట్లాడుతూ ఎఫ్ ఎల్ ఎన్ మానిటరింగ్ చేసే టాంజరిన్ యాప్ గురించి వివరించారు.జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన పాల్వాయి ఎల్ ఎఫ్ ఎల్ హెడ్మాస్టర్ కుసుమలత, మేకల సోంపల్లి హెడ్మాస్టర్ మల్లికార్జున్ కాంప్లెక్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సన్మానించడం జరిగినది.ఈ సమావేశంలో ఆర్పీలు సీతం నాయుడు,శ్రీకాంత్,శంకర్ నాయక్ ,హరిప్రియ,భాస్కర్,గోపాల్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు,ఐఈ సిశేఖర్, సిఆర్పి పద్మమ్మ పాల్గొన్నారు.