విద్యార్థులు పట్టుదలతో చదవాలి

– మంత్రి తన్నీరు హరీశ్‌రావు

రంగారెడ్డి, ఆగస్టు4(జ‌నం సాక్షి) : విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని, అప్పుడు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. పరిగిలో వీఆర్‌వో, కానిస్టేబుల్‌ ఉచిత మెటీరియల్‌ను శనివారం మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ…. నగరంలో కోచింగ్‌ తీసుకోవాలంటే రూ.30 వేల వరకు ఖర్చు వస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వరంలో మనోహర్‌రెడ్డి విూకు మంచి అవకాశం కల్పించారన్నారు. ఉద్యోగాలకు సిద్దం అయ్యే వారికి ఆత్మవిశ్వాసం అవసరమని, ఆత్మవిశ్వాసంతోనే సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం సాధించారన్నారు. క్రమ పద్దతిలో చదివి ఉద్యోగాలు సాధించాలన్నారు. పోలీస్‌ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించామని హరీష్‌రావు తెలిపారు. ఎవరి జిల్లాలోని ఉద్యోగాలు వారికే దక్కేలని సీఎం కేసీఆర్‌ ప్రధానిని కలుస్తున్నారన్నారు. మరి కొన్ని రోజుల్లో పంచాయితీ సెక్రటరీల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ కాబోతోందని, విద్యార్థులు ఇష్టపడి, పట్టుదలతో చదివవి వాటిని సాధించాలని సూచించారు.