విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి
పి హెచ్ సి ఇనుగుర్తి
కేసముద్రం అక్టోబర్ 15 జనం సాక్షి / విద్యార్థులందరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలనే ఉద్దేశ్యంతో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం అక్టోబర్ 15 ను పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇనుగుర్తి వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఇనుగుర్తి,మండల ప్రజా పరిషత్ పాఠశాల లాలు తండాలో గ్లోబల్ వాషింగ్ డే కార్యక్రమం తో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన పట్ల సదస్సును ఏర్పాటు చేశారు.చేతులను శుభ్రంగా కడుకున్న తర్వాతే ఆహారం తీసుకోవాలని,చేతులు సబ్బుతో శుభ్రంగా కడగడం వలన వ్యాధులు నివారించవచ్చని ఆసుపత్రి సిబ్బంది సూచించారు.అనంతరం విద్యార్థులకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించి ఉత్తమంగా బొమ్మలు గీసిన వరుదోలు కార్తిక్, పాల జీవన్, బొల్లా బోగేశ్వర్ లకు ఉపాద్యాయులచేత బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రాజేందర్, గోపీ,ఆజాద్ చంద్ర శేఖర్,రాములు,ఆసుపత్రి సిబ్బంది ఏ.ఎన్. ఎం లు కవిత,అల్లిక ఆశ వర్కర్ లు శ్రీలత, రమ, లక్ష్మి,అరుణ,శ్యామల పాల్గొన్నారు.