విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపు నాకే తొలి మెట్టు.

జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిఈఓ గోవిందరాజులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై26(జనంసాక్షి):
జిల్లాలో 556 ప్రాథమిక పాఠశాలలు 128 ప్రాథమికున్నత పాఠశాలల్లో  1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న 45,122 మంది విద్యార్థుల సామర్థ్యాల పెంపుకు నిర్వహించే తొలిమెట్టు నిర్వహణ కు జిల్లా స్థాయిలో 75 మంది గుర్తించిన మండల స్థాయి రిసోర్స్ పర్సన్ లకు శిక్షణ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిఈఓ గోవిందరాజులు మంగళవారం ప్రారంభించారు. ఇట్టి శిక్షణ కార్యక్రమము మూడు రోజులు పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి డీఈవో గోవిందరాజులు మాట్లాడుతూ…
కొవిడ్‌  కారణంగా ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థుల కనీస సామర్థ్యాలు తగ్గినట్టు జాతీయస్థాయిలో నిర్వహించిన మ్యాస్‌పరీక్ష నివేదికలు వెల్లడైనందున వారిలో సామర్థ్యాల పెంపు కోసం రాష్ట్ర విద్యాశాఖ కొత్తగా ‘ తొలిమెట్టు అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలుగుభాషతో పాటు గణితంలో కనీస సామర్థ్యాలు పెంపొం దించేందుకు ఆగస్టు 15 నుండి తొలిమెట్టు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంపై రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ అధికారులు, సెక్టోరియల్‌ అధికారులతో అవగాహనకల్పించారన్నారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ తీసుకున్న రిసో ర్స్‌పర్సన్‌లు జిల్లా రిసోర్స్‌ పర్సన్‌లకు నేటి నుండి మూడు రోజులపాటు శిక్షణ ఇస్తారని తెలిపారు. జిల్లా స్థాయి శిక్షణ అనంతరం మండలస్థాయిలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.ఈ శిక్షణా కార్య క్రమంలో భాష, తెలుగు సామర్థ్యాల పెంపుకోసం కృషి చేయాలని సూచించారు. తెలుగు, ఉర్దూ భాషలలో ఉపాధ్యాయులకు వేర్వేరుగా శిక్షణా కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ మేరకు రిసోర్స్‌ పర్సన్‌లు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు
 గడచిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో రాష్ట్రం యొక్క స్థాయి దిగువన ఉండడం వలన విద్యార్థులలో కనీస అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించే బాధ్యతను ప్రతి ఉపాధ్యాయుడు తీసుకొని, తొలిమెట్టు కార్యక్రమాన్ని మాడ్యూల్లో ఇచ్చిన ప్రకారం తరగతి గదిలో విద్యార్థికి అందించి, వార్షిక ప్రణాళిక, వారాంత ప్రణలిక, పీరియడ్ ప్రణాళికను రూపొందించుకొని అభ్యసన సామర్ధ్యాలను పాఠ్యపుస్తకంలో ఇచ్చిన విధంగా పెంపొందించవలెనని, ఇట్టి కార్యక్రమము నిరంతరం కొనసాగుతుందని, మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి బృందాలు పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, వారు గుర్తించిన అంశాలను యాప్ ద్వారా నమోదు చేయడం జరుగుతుందని, ప్రతి నెల 27న పాఠశాల స్థాయి సమీక్ష, 28న మండల స్థాయి సమీక్ష, 29న జిల్లాస్థాయి సమీక్ష, 30న రాష్ట్రస్థాయి సమీక్ష ఉంటుందని వివరించారు. బోధన ఐదు రోజులకు, మూల్యాంకలను ఒకరోజు ప్రణాళిక బద్ధంగా అమలు చేయాలని సూచించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రతి మండలం నుంచి నలుగురు రిసోర్స్ పర్సన్లు పాల్గొనడం జరిగింది. వీరికి రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన రీసర్చ్ పర్సన్ శిక్షణను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీ సతీష్ కుమార్, డి ఎస్ ఓ కృష్ణారెడ్డి మరియు జిల్లా ఆర్పీలు పాల్గొనడం జరిగింది.