విద్యార్థుల పట్ల ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి.

సర్పంచ్ గన్నోజు సునిత శ్రీకృష్ణచారి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 15(జనంసాక్షి):
పాఠశాలలో, అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మారెడుమాన్ దిన్నె సర్పంచ్ గన్నోజు సునిత శ్రీకృష్ణచారి అన్నారు.గురువారం ఆమె ఏఎన్ఎం మరియు ఆశాకార్యకర్తతో కలిసి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాల లోని విద్యార్థులకు నులిపురుగులు నివారణ మందులను వేశారు.అనంయరం పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల పరిసరాలు మరియు వంటగది, త్రాగునీటిని పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడి వారి అలవాట్లు, పరిశుభ్రత గురించి తెలుసు కున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పరిశుభ్రత ను తప్పనిసరిగా పాటించాలని,క్రమశిక్షణ తో చదువుకోవాల ని విద్యార్థులకు సూచించారు.వర్షాకాలం ఉన్నందున అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కావునా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అంగన్వాడీ కార్యకర్త మరియు పాఠశాల ఉపాధ్యాయు లకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయు లు నరేష్, ఏఎన్ఎం నాగమణి,అంగన్వాడి టీచర్ గన్నోజు అలివేలమ్మ, ఆశ వర్కర్లు భాగ్యమ్మ, జ్యోతి, పల్లవి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area