.విద్యార్థుల సమస్యల సాధనకై ఏబీవీపీ నిరంతర పోరాటం

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీధర్

మక్తల్ జూలై 09 (జనంసాక్షి) విద్యార్థుల సమస్యల సాధనకై ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తుందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీధర్ అన్నారు. శనివారం మక్తల్ పట్టణంలో ఏబీవీపీ 75 వ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఏబీవీపీ మఖ్తల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీధర్ పాల్గొన్ని స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాలవేసి పూజ నిర్వహించారు. అనంతరం ఏబీవీపీ కాగడ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ
భారత దేశంలో అనైక్యతల కారణంగా కోల్పోయిన స్వాతంత్ర్యం సాధించుకోవడంలో కొన్ని వేలమంది అమరులైనారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో మనం స్వతంత్ర సమరయోధులను మనం తలుచుకుంటున్నాము. భారత దేశంలో ఇటువంటి సంఘటనలు పునఃరావృత్తం కాకుండా, భారతమాత పునర్ వైభవం కోసం విద్యార్థి, యువతను సంఘటిత పరిచి వారిలో దేశభక్తి, దేశం పట్ల నిష్ఠను ప్రాదుకొల్పడం కోసం జ్ఞానం, శీలం, ఏకతలే ధ్యేయంగా విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది అన్నారు. ఏబీవీపీ 1948వ సంవత్సరంలో ఢిల్లీ యూనివర్సిటీలో అతికొద్ది మందితో తన ప్రస్థానాన్ని కొనసాగించినా, 1949 జూలై 9 న అధికారికంగా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఏబీవీపీ రాబోయే కాలంలో అమృతోత్సవాలు (75 సంవత్సరాలు ) జరుపుకోబోతున్న సందర్భంగా ఈ సంవత్సరం నుండే యేడాది పొడుగునా వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టబోతుందన్నారు. ఆగస్ట్ 15 రోజున ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఎగురవేసి, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అజ్ఞాత స్వాతంత్ర్య సమరయోధుల గురించి యువతకు తెలియచేసి వారిలో దేశభక్తి స్ఫూర్తి రగిలించడం కోసం ఏబీవీపీ కృషి చేయాలని సంకల్పించిందన్నారు వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునఃనిర్మాణమే ధ్యేయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు అన్ని రంగాల విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా విద్యార్థి పరిషత్ పనిచేయడంలో ముందుంది.
ఇట్టి కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి శరణ్ .అశోక్ . వినయ్ .వంశీ. నవీన్ . శివ. అజయ్. బంటి తదితరులు పాల్గొన్నారు.