విద్యార్ధి ఆత్మ హత్య.

 

 

 

 

 

 

 

కళాశాల ఎదుట విద్యార్థుల ధర్నా.

-కళాశాల యాజమాన్యం వేధింపుల కారణమా..?

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని  శ్రీ కృష్ణ వేణి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కళాశాల యాజమాన్యం ఒత్తిడి భరించలేక వెంకటేష్ శుక్రవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ధరూర్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన వెంకటేష్ (17) తండ్రి మల్లేష్ గద్వాల పట్టణంలోని శ్రీకృష్ణవేణి జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. గురువారం కళాశాల ముగిసిన తర్వాత జిల్లా కేంద్రంలోని గంజిపేట కాలనీలో అద్దెకి తీసుకున్న రూముకు వెళ్ళాడు. రూమ్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు తన స్నేహితులు గమనించి అంబులెన్స్ సమాచారం ఇవ్వడంతో కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థి మృతికి కళాశాల యాజమానమే కారణమని ఆరోపించారు. కళాశాల యాజమాన్యం విద్యార్థినీ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం తోనే విద్యార్థి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఫీజులు వసూలు చేయడం తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయడం ఈ కళాశాల యాజమాన్యం చేస్తోందని ఆరోపించారు.