విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

ఆదిలాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చైల్డ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫోరం జిల్లా కార్యదర్శి సాంబశివ్‌ అన్నారు. జిల్లాలోని అన్ని మండల, గ్రామా ల్లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించేందుకు సీఆర్‌పీఎఫ్‌ కృషి చేస్తోందన్నారు. 6 – 14 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రులు బడిలోకి పంపించాలన్నారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రాజకీ య నాయకులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు బడీ డు పిల్లలను బడిలో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల ఫీజుల కోసం పిల్లలను ఒత్తిడికి గురి చేయొద్దని డిమాండ్‌ చేశారు.

 

తాజావార్తలు