విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
పుప్పాలగూడ: రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ శ్రీనగర్ కాలనీలోని శ్రీజ ఏంజెల్స్ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం విద్యుత్తు కోత సమయంలో ఒక గృహిణి వాటర్ హీటర్ యూనిట్ స్విచ్ ఆఫ్ చేయకుండా పక్కనే ఉన్న కంప్యూటర్ సీపీయూపై ఉంచారు. కోత అనంతరం విద్యుత్తు సరఫరా ఒక్కసారిగ రావటంతో కంప్యూటర్, ఇంటిలో ఉన్న మిగిలిన ఫర్నిచర్ కాలిపోయింది. మాదాపూర్ అగ్నిమాపక శాఖాధికారి ఫజుల్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ అపార్ట్‌మెంట్ నివాసయోగ్యం కాదని, దీనికి ఎలాంటి అనుమతులు లేవన్నారు.