విద్యుత్‌ కొరత లేకుండా చూస్తాం

1

కరెంటు అవసరాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌,ఫిబ్రవరి26(జనంసాక్షి): ఎట్టిపరిస్థితుల్లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఆటంకం కలుగకుండా విద్యుత్‌ సరఫరా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు. ఉన్న విద్యుత్‌తో పాటు ఎక్కడెక్కడ నుంచికొనుగోలు చేస్తున్నదీ ఆయన ఆరా తీసారు. . సోలార్‌ విద్యుత్‌తో కొరతను అధిగమించేందుకు మార్గాలను అన్వేషించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సచివాలయంలో విద్యుత్‌శాఖ అధికారులతో సవిూక్ష చేపట్టారు. సమావేశంలో రాష్ట్రంలోని తాజా విద్యుత్‌ పరిస్థితిపై, అదేవిధంగా నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మించతలపెట్టిన విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రంలో విద్యుత్‌ లభ్యత, డిమాండ్‌పై అధికారులతో మాట్లాడారు.  ఈశాన్యప్రాంత పవర్‌గ్రిడ్‌, కేరళలోని కాయంకుళం పవర్‌గ్రిడ్‌ నుంచి రాష్టాన్రికి విద్యుత్‌ను తీసుకువచ్చే మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. అనంతరం అధికారులు విద్యుత్‌ పరిస్థితిపై సీఎంకు వివరిస్తూ.. రోజుకు 4

నుంచి 5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను పవర్‌ ఎక్సేంజ్‌ నుంచి కొనుగోలు చేస్తున్నమని తెలిపారు. మరో 800 మిలియన్‌ యూనిట్ల కొరతను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌కోతలను అధిగమించేందుకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఈసందర్భంగా సీఎంకు అందించారు.  తెలంగాణలో రోజుకు 800 మెగావాట్ల విద్యుత్‌ కొరత ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు నాలుగు నుంచి ఐదు మిలియన్ల యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేరళ నుంచి విద్యుత్ను కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం పరిశ్రమలు ఇబ్బంది పడకుండా విద్యుత్‌ ను అందిస్తామని హావిూ ఇచ్చారు. కొత్త విద్యుత్‌ ప్రాజెక్టుల పురోగతిపై కూడా కేసీఆర్‌ ఆరాతీసినట్లు తెలిసింది.

కెసీఆర్‌తో భేటీ అయిన థింక్‌ కేపిటల్‌ చైర్మన్‌

అమెరికాకు చెందిన థింక్‌ కాపిటల్‌ చైర్మన్‌ రవిరెడ్డి, థింక్‌ ఎనర్జీ చైర్మన్‌ ప్రశాంత్‌ సచివాలయంలో  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. మురుగునీటి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని వారు సీఎంకు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములమవుతామని చెప్పారు. సౌరవిద్యుత్‌ కేంద్రాలను కూడా నెలకొల్పుతామని వారు తెలిపారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికలతో ముందుకు రావాలని కేసీఆర్‌ వారికి సూచించారు.

నీటిపారుదలపై సిఎం సవిూక్ష

నీటిపారుదల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ సవిూక్షను నిర్వహించారు. ఈ సవిూక్షలో నీటిపారుదల శాఖ అధికారులతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెండింగ్‌ లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు పలు అంశాలపై చర్చించనున్నారు.