విద్యుత్‌ కోతల వివరాలు ప్రకటించిన ట్రాన్స్‌కో

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతల వివరాలను ట్రాన్స్‌కో అధికారులు ప్రకటించారు. డిస్కంలు అధికారులతో ట్రాన్స్‌కో ఎండీ హీరాలార్‌ సమారియా సమావేశమై రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాపై సమీక్షించారు.

విద్యుత్‌ కోతల వివరాలు:
1) వ్యవసాయానికి 7గంటలు విద్యుత్‌ సరఫరా
2) సింగరేణి, తాగునీరు, ప్రభుత్వ వైద్యకళాశాలలు, రైల్వేశాఖ, వ్యవసాయానికి విద్యుత్‌కోత నుంచి మినహాయింపు
3) తిరుపతి, విశాఖ, వరంగల్‌ నగరాల్లో రోజుకు 3గంటల కోత, జిల్లా కేంద్రాల్లో రోజుకు 5గంటల కోత
4) గ్రామీణ ప్రాంతాల్లో గృహావసరాలకు సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు విద్యుత్‌ సరఫరా
5) పట్టణాల, పురపాలకసంఘాలు, మండలాల్లో రోజుకు 6గంటల విద్యుత్‌ కోత
6)పరిశ్రమలకు వారానికి మూడురోజుల చొప్పున నెలకు 12రోజుల విద్యుత్‌ కోత
7)చిన్నతరహా పరిశ్రమలకు వారానికి రెండు రోజుల చొప్పున నెలకు 8రోజులు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తారు
8)కోళ్ల పరిశ్రమ, రైస్‌ మిల్లులు, శీతల గిడ్డంగులకు 40శాతం విద్యుత్‌ కోత వుంటుంది.

తాజావార్తలు