విద్యుత్‌ చార్జీలపై విపక్షాలది రాద్ధాతం

‘అమ్మహస్తం’ ప్రారంభించిన సీఎం
మంచిర్యాల సభలో కిరణ్‌ చిటపట
మంచిర్యాల్‌, ఏప్రిల్‌ 10 : ఉగాది కానుకగా పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మ హస్తం పథకాన్ని అందిస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలోని తెల్లరేషన్‌ కార్డు లబ్ధిదారులందరికీ అమ్మ హస్తం పథకం కింద 185 రూపాయలకే 9 వస్తువులను ఇవ్వనున్నట్టు  ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 2 కోట్ల 25 లక్షల మందికి లబ్ధిచేకూరుతుందని అన్నారు. 185 రూపాయలకు 9 వస్తువులను ఇచ్చే ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. కేజీ కంది పప్పు, కేజీ గోధుమలు, కేజీ గోధుమ పిండీ, ఆరకిలో పంచదార, ఒక లీటర్‌ పామాయిల్‌, ఒక కిలో ఉప్పు, ఆర కిలో చింతపండు, పావు కిలో కారంపోడి, వందగ్రాముల పసుపు, 185 రూపాయలకే  తెల్ల రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పేరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రజలపై భారం పడకుండా ఉండేందుకే ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనే లేదని అన్నారు. అయితే తక్కువ ధరకు వస్తువులను పంపిణీ చేసినంత మాత్రన  నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడబోమని శ్రీధర్‌బాబు అన్నారు. ధరల భారం నుంచి పేదలకు విముక్తి కలిగించేందుకే 300 రూపాయల విలువైన తొమ్మిది వస్తువులను కేవలం 185 రూపాయలకు అందిస్తున్నామని చెప్పారు. ఈ వస్తువులు ప్రతి నెల 15వ తేదీలోగా పంపిణీ జరుగుతుందని ఆయన అన్నారు. ఒక్క సంవత్సరం పాటు ఈదే ధరకు 9 వస్తువులను తెల్ల రేషన్‌ కార్డుదారులకు అందిస్తామని మంత్రి అన్నారు. తొమ్మిది వస్తువులలో అవసరమైన వస్తువులనే తీసుకునే అకవకాశం కూడా వారికి కల్పించినట్లు చెప్పారు. అయితే పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్చేందుకే ఈ అమ్మ  పథకం నిదర్శనమని  శ్రీధర్‌బాబు అన్నారు.