విద్యుత్ ఛార్జీలపై నేడు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
హైదరాబాద్, జనంసాక్షి: విద్యుత్ ఛార్జీల రాయితీ భరించడంపై మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సాయంత్రం నిర్ణయం తీనుకోనుంది. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సమావేశం కానుంది.150 యూనిట్ల వరకు గృహ విద్యుత్ వాడకంపై రాయితీని భరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతులుకు ఉచిత విద్యుత్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని మంత్రులు చెబుతున్నారు.