విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై సీపీఎం ధర్నా
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్తు భారాన్ని పెంచేందుకు ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ సీపీఎం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మనుె దహనం చేశారు. కిరణ్ అసమర్థ పాలనతో విద్యుత్తు ఛార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారంటూ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్తు ఛార్జీ పెంపుపై ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కాంగ్రెస్ నేతలు ప్రజలకు వివరించాలని డిమాండ్ వ్యక్తం చేశారు.