విద్యుత్ ధరలను తగ్గించాలి
దంతాలపల్లి : పెంచిన విద్యుత్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఎం మండల కార్యదర్శి జి. మోహన్ డిమాండ్ చేశారు. నర్సింహులపేట మండలం దంతాల పల్లిలో సీపీఎం కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడారు. పెంచిన ధరలతో లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యుత్ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.