విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించరాదు


సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ చంద్రశేఖర్‌
కామారెడ్డి,ఆగస్ట్‌11(జనం సాక్షి): విద్యుత్‌ ఉద్యోగుల సంఘం ఆలిండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాకు సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ చంద్రశేఖర్‌ పాల్గొని పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ సవరణ బిల్లు 2021 వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ రంగంలోని ఇంజనీర్లు
ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో పాటు డిస్కాంలు ప్రైవేటు పరమయ్యాయి అని పేర్కొన్నారు. రాష్టాల్ర హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తుందని విమర్శించారు రాష్ట్రంలో 1.62 కోట్ల మంది ఈ చట్టాలను అనుసరించి కాకపోతే విద్యుత్‌ వినియోగదారులు 59 లక్షల మందికి రాయితీలు రద్దు చేయడం ద్వారా ఛార్జీలు పెరుగుతాయన్నారు. రైతులకు ఉచిత కరెరటు ఇచ్చే పరిస్థితి లేదని డిస్కంలు ప్రైవేటీకరణతో వేలాది మంది ఉద్యోగులకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం దేశ వనరులను సంపదలను ఒక్కొక్కటిగా అంబానీ దాని వంటి వారికి తాకట్టు పెడుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ చట్టాలను ఉపసంహరించుకోకపోతే సమరశీల పోరాటాలు చేస్తామని చంద్రశేఖర్‌ హెచ్చరించారు.