విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మూగజివి మృతి.
కోటగిరి జూలై జనం సాక్షి:-ఏర్తింగ్ వైర్లకి ముగజీవి అయిన గేదె తగిలి మృతి చెందిన ఘటన కోటగిరి మండలంలోని జల్లాపల్లి ఫారంలో చోటుచేసుకుంది.గ్రామంలో లేవన్ కేవి,ఎల్టి లైన్ తీగలు ఇండ్ల పైన నుండి వెళ్తూ గ్రామ ప్రజలకు పలు విధాల మరణ ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు చాలా సందర్భాలలో గ్రామంలో చోటు చేసుకున్నయి.ఈ విషయమై మండల విద్యుత్ శాఖ అధికారులకు స్థానిక ప్రజలు, సర్పంచ్ పలుమార్లు వారికి తెలిపిన విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నిర్లక్ష్య వైన్యానికి నేడు ఒక మూగ జీవి అయిన గేదె మృతి చెందింది.ఇకనైనా విద్యుత్ అధికారులు జల్లాపల్లి గ్రామంలో ఉన్న విద్యుత్ తీగలను సరైన క్రమంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి స్థానిక ప్రజల ప్రాణాలను కాపాడాలనికి కోరారు.]
Attachments area