విద్యుత్ అధికారుల పనితీరు పై ప్రజాప్రతినిధుల ఫైర్
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసా క్షి):-యాచారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొప్పు సుకన్య అధ్యక్షత న మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎంపీపీ అనుమతితో వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు విద్యుత్ శాఖ అధికారి సందీప్ కుమార్ తమ నివేదికను చదివి వినిపిస్తుండగా తక్కలపల్లి తండా సర్పంచ్ జగదీష్ నాయక్ నానక్ నగర్ సర్పంచ్ దంతుక పెద్దయ్య ఎంపీటీసీ బావయ్య తమ గ్రామాలలో నెలకొన్న కరెంటు సమస్యలు తీరడం లేదని ప్రతి సమావేశంలో విన్నవించిన పరిష్కారం కావడం లేదని ప్రజలు తమను నిలదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ కలగజేసుకొని గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరగా 15 రోజులలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కొప్పు సుకన్య మాట్లాడుతూ.. ప్రతి సమావేశంలో ప్రజా ప్రతినిధులు విన్నవించిన సమస్యలను అధికారుల పరిష్కరించడం లేదని ఇప్పటికైనా అధికారులు చర్చించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి వైస్ ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి లు తాండ్ర లక్ష్మమ్మ,లక్ష్మీ పతి గౌడ్,బాబు,రజిత రాజునాయక్,భారతమ్మ, తక్కలపల్లి తండా సర్పంచ్ జగదీష్ నాయక్ నానక్ నగర్ సర్పంచ్ దంతుక పెద్దయ్య చౌదర్ పల్లి సర్పంచ్ నాయిని నర్సిరెడ్డి దర్పన్నగూడ సర్పంచ్ భాషయ్య గడ్డం మల్లయ్య గూడ సర్పంచ్ జంగయ్య తాడిపర్తి సర్పంచ్ దూస రమేష్ కురుమిద్ద సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి వివిధ శాఖల అధికారుల తదితరులు పాల్గొన్నారు.
3 Attachments • Scanned by Gmail