విద్య సంస్థల బంద్ విజయవంతం
-కార్పొరేట్ కాలేజీలను నియంత్రించాలి: విద్యార్థి సంఘాలు
రామారెడ్డి ఆగస్టు 23 జనంసాక్షీ :
రాజస్థాన్‌లో విద్యార్థి మృతికి నిరసనగా విద్య సంస్థలు బంద్ విజయవంతం చేసినట్లు భీమ్ ఆర్మీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహేష్ రావణ్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 23 నాడు బంద్ పిలుపు నిచ్చిన నేపథ్యంలో కార్పొరేట్ విద్యా సంస్థలను బంద్ పాటించాయని అన్నారు. కార్పొరేట్ ఆగడాలను అరికట్టి, అధిక ఫీజులను నియంత్రిం చాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తో పాటు రామారెడ్డి మండల పరిధిలో గల పాఠశాలలు ,కాళశాలలు సంపుర్ణంగా బంద్ పాటించాయని అన్నారు. అనుమతి లేకుండా ప్రైవేటు కాలేజీలను యాజమాన్యాలు నిర్వహిస్తు న్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. వీటిపై ప్రభుత్వం కనీస నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం హేయమైన చర్యగ పరిగణిస్తు న్నామని ద్వజమెత్తారు. అధికారుల తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పాటిస్తున్నట్టు చెప్పారు. ఇంటర్‌లో తప్పుడు ర్యాంకులతో కాలేజీలు ప్రచారం చేసుకుంటున్నా నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి, ఇంటర్ విభాగం అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫామ్‌లను కాలేజీల ప్రాంగణంలోనే విక్రయిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. విద్యా సంవత్సరం పూర్తి అయిన విద్యార్థులకు అందవలిసిన సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధిక ఫీజుల కోసం వేధింపులకు గురి చేస్తుండటంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. ఇదే కారణంతో రామంతపూర్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన సాయి నారాయణ స్వామి అనే విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డా డని గుర్తు చేశారు. కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని కోరారు. విద్యార్థి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ నాయకులు బద్ది సతీష్ మగ్గం రాజేష్ బొల్లారం నరేష్ కుంభాల విజయ్ తరితరులు పాల్గొన్నారు.