విద్వేశాలు రెచ్చగొట్టేందుకే సెక్షన్‌-8

4

– హైదరాబాద్‌పై ఆంధ్రుల పెత్తనం సహించం

– ప్రొఫెసర్‌ కోదండరామ్‌

హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి):

సెక్షన్‌-8 పేరుతో    హైదరాబాద్‌లో విద్వేశాలు రెచ్చగొట్టి,        అధికారాలు తీసుకునే ప్రయత్నం జరుగుతోందని టీ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. సెక్షన్‌-8 అనేది పరిమితమైన అధికారం మాత్రమేనని, ఇది రాజ్యంగ స్పూర్తికి విరుద్ధమన్నారు. తెలంగాణ సమాజం దీన్ని ఆమోదించదన్న కోడందరాం, కేంద్రం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజల మధ్య ఘర్షణ ఉండొద్దని ఆయన సూచించారు. ఏడాది కాలంలో హైదరాబాద్‌లో శాంతియుత వాతవరణం ఉందన్న కోదండరాం ప్రజల మధ్య పాలకులు వైషమ్యాలు సృష్టించరాదని హితవు పలికారు. ఆంధ్రా సర్కార్‌ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సెక్షన్‌ 8తో విశేషాధికారులు, హక్కులకు చంద్రబాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. శాంతియుత పాలనను దెబ్బతీసేలా ఆంధ్రా పాలకుల వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సామరస్యంగా ఉన్నారు.. ఉండాలి. ఈ ఏడాది కాలంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తలేదని తెలిపారు. ప్రజలు శాంతియుతంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆంధ్రా సర్కార్‌ తీరు రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కోదండరాం పేర్కొన్నారు. సెక్షన్‌ 8పై ఆంధ్రా సర్కార్‌ విజ్ఞప్తులను కేంద్రం ఆమోదించొద్దని కోరారు. గవర్నర్‌పై ప్రజాప్రతినిధులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. వ్యక్తిగతమైన కేసులు కోర్టుల్లో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పోలీసులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం విజ్ఞతతో కూడిన నిర్ణయమన్నారు. పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-2014 లోని సెక్షన్‌-8 పై వివాదాలు సృష్టించవద్దని ఏపీ నాయకులను ఉద్దేశించి ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ‘ఓటుకు నోటు’ కేసు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పూర్తి వ్యక్తిగతమైన అంశమని అన్నారు. ఈ కేసు విషయమై విూడియాతో ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి సంబంధించిన కేసును రెండు ప్రాంతాల తగాదాగా చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.  కేసును అవకాశంగా తీసుకుని ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్థమన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా రెండు ప్రాంతాల మధ్య గొడవ జరగలేదని ఆయన గుర్తుచేశారు. ఈ నెల 21 న ప్రొఫెసర్‌ జయశంకర్‌ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.