” వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందాం – బిజెపి నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 24( జనంసాక్షి): భారతదేశంలోనే ఎంతో విశిష్టతను కలిగి తొమ్మిది రోజులపాటు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జరుపుకునే వినాయక చవితి పండుగను హైదరాబాదులో ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని, భారతీయతను, జాతీయ భావాన్ని పెంపొందించేలా నవరాత్రులు కొనసాగాలని శేర్లింగంపల్లి బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ నేతృత్వంలో బుధవారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర సమక్షంలో జరిగిన ప్రత్యేక సమావేశానికి యోగానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినం మత సామరస్యానికి ప్రతికయని, ప్రతి భారతీయుడు ఎంతో సంతోషంగా జరుపుకునే అతిపెద్ద పండుగగా ఆయన అభివర్ణించారు. శాంతియుత వాతావరణంలో, ఇతరులకు ఇబ్బంది కలగనట్లుగా గణేష్ నవరాత్రులను యువత, పిల్లలు పెద్దలు కోలాహలంగా పండుగని జరుపుకోవాలని గజ్జల ఆశాభం వ్యక్తంచేశారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గణేష్ నవరాత్రుల సందర్భంగా అల్లరి మూకలనుండి, అసాంఘిక శక్తులనుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తారని, ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగే అవకాశం ఉందని ఆయన ధీమాను వ్యక్తంచేశారు. ఈనెల 31వ తేదీ నుండి నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు గజ్జల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి బృందం, పోలీసు అధికారులు, భక్తులు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.