వినియోగదారుల చట్టాలపై అవగాహన సదస్సు…
కరపత్రాల ఆవిష్కరణ చేసిన మంగళ పెళ్లి హుస్సేన్,బట్టు శ్రీనివాస్
కేసముద్రం అక్టోబర్ 14 జనం సాక్షి / కేసముద్రం మండలం అంబేద్కర్ సెంటర్లో జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం కేసముద్రం మండలం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్, ఆల్ ఇండియా ప్రజా లేబర్ పార్టీ అధ్యక్షుడు బట్టు శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కల్తీ విత్తనాలు వినియోగదారుల చట్టాలపై అవగాహన సదస్సు కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా మంగళంపల్లి హుస్సేన్,బట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు వస్తువు కొనుగోలు చేయగానే బిల్స్ తప్పనిసరిగా తీసుకోవాలి అదేవిధంగా ప్రతి వస్తువులు నాణ్యత ఉండాలన్నారు.చట్టాల గురించి అవగాహన సదస్సు ఈ నెల 30 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి,రాష్ట్ర ట్రెజరీ శ్రీరామ్ నవీన్, ఇల్లందు విజయకుమార్, స్టాలిన్,వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగట్టి విష్ణువర్ధన్, జనరల్ సెక్రెటరీ విక్రమ్ కుమార్, కమిటీ మెంబర్ శంకర్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు,
Attachments area