విన్నపాలు వినవలె

28లోగా తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకోవాలి
ప్రధానికి టీ ఎంపీల వేడుకోలు
ఢిల్లీ, డిసెంబర్‌ 14 (జనంసాక్షి) :
ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు శుక్రవారం కలిశారు. తెలంగాణ అంశంపై తేల్చకపోతే ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ఓటు వేయమని భిష్మించుకుని కూర్చొని అఖిల పక్షం ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చాక ఓటింగ్‌లో పాల్గొన్న టీ కాంగ్రెస్‌ ఎంపీలు హోంమంత్రి షిండే పార్టీకి ఇద్దరు చొప్పున రావాలని రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు పిలువు వచ్చిన నేపథ్యంలో టీ కాంగ్రెస్‌ ఎంపీలు ప్రధానిని కలిశారు. ఈ భేటీలో ప్రధాన మంత్రి మౌనంగా టీకాంగ్రెస్‌ ఎంపీల విజ్ఞప్తిని అలకించినట్లు సమాచారం. ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ అంశం తేల్చాలని వారు ప్రధానిని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ వైఖరి స్పష్టం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు తిరుగుండదని లేకపోతే కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగడం ఇబ్బందే అని ప్రధానితో తెగేసి చెప్పినట్లుగా టీ కాంగ్రెస్‌ ఎంపీలలో ఒకరు మీడియాతో చెప్పారు.
ఇప్పటికే కేసీఆర్‌ ఆఫర్‌ ను పరిశీలించాల్సి వస్తుందని మందా జగన్నాధం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. క్కోపార్టీ నుంచి ఒక్కరినే ఆహ్వానించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ప్రధానిని కలిసిన వారిలో ఎంపీలు వివేక్‌,పోన్నం, సిరిసిల్ల రాజయ్య, మందా జగన్నాథం, మధుయాష్కి గౌడ్‌, కోమటిరెడ్డి రాజగోపపాల్‌రెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, రాపోలు ఆనంద బాస్కర్‌ ఉన్నారు.