విపక్షపాత్రనూ అధికార పక్షమే పోషిస్తోంది

కడి. విశాఖ దీక్షలు దేనికి సంకేతం

అవకాశాలకు అనుగుణంగా బాబు రాజకీయాలు

అమరావతి,జూలై5(జ‌నం సాక్షి): ఆంధ్రపద్రేశ్‌లో ఎక్కడా లేనివిధంగా ఎన్నికల వేడి పుట్టుకుని వచ్చింది. అన్ని పార్టీలు అప్పుడే ఎన్నికల గోదాలో దిగాయి. చంద్రబాబు ఇప్పుడు తనను మించిన ¬దావాది లేడని మాట్లాడుతున్నాడు. బిజెపిని దుష్టశక్తిగా చూపి పోరాటానికి తెరలేపారు. ఇందులో బిజెపి, పవన్‌ కళ్యాణ్‌, వైకాపా అంతా దోషులే అన్న విధంగా ఆయన విమర్శల శైలి సాగుతోంది. ధర్నాలు చేయాల్సిన అవసరం ప్రతిపక్షాలకులేకుండా అధికార పక్షమే చేస్తోంది. ఇటీవల కడపలో ఉక్కుదీక్ష, విశాఖలో రైల్వే దీక్షలు చూస్తే అధికార పక్షమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఇక వైకాపా అధినేత జగన్‌ అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు. గత ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ, పవన్‌ కల్యాణ్‌లతో జట్టుకట్టి నాలుగేండ్లు అధికారంవెలగబెట్టిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రం మోసం చేసిందంటూ వీధిపోరాటాలు చేస్తున్నారు. ప్రత్యేక ¬దా కావాలని ఎవరయినా అంటే అరెస్టులు చేయించేదాకా వెళ్లిన ఆయన ఇప్పుడు తానే అందుకు ట్రేడ్‌ మార్క్‌ అన్నరీతిలోముందుంటున్నారు. అవసరం మేరకు రాజకీయాలు నడపడంలో బాబు దిట్ట. యునైటెడ్‌ ఫ్రంట్‌కు నేనే కర్త కర్మ క్రియ అని చెప్పుకున్న చంద్రబాబు కార్గిల్‌ యుద్ధంతో ఎన్డీయేకు ప్రతిష్ఠ పెరుగగానే ఫ్రంట్‌ను యమునా నదిలోకి విసిరేసి, ఎన్డీయేలో చేరారు. మళ్లీ నాలుగేండ్లకే నరేంద్ర మోదీ హంతక రాజకీయాలను వ్యతిరేకిస్తూ 2004లో ఎన్డీయే నుంచి బయటికి వస్తున్నానంటూ ప్రకటించిన చంద్రబాబు, పదేండ్లు తిరిగేసరికి అదే నరేంద్ర మోదీతో జట్టుకట్టారు. రాజకీయ అవసరాలకు అనుగుణంగా విధానాలు మార్చడంలో బాబును మించిన వారు లేరు. దాదాపు నాలుగేళ్లపాటు బిజెపితో కలసి పాలన వెలగబెట్టడమే గాక రాని ¬దా కోసం, సహాయం కోసం సన్మాన సత్కారాలు చేసినా బాబుకు ఫలం దక్కలేదు. కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ఏమిటో ఎంతో వివరించడంలో సిద్దంగా లేరు. మేలు చేస్తారనే నమ్మకంతో అప్పుడు కలిసి వుండటం గొప్ప, ఇప్పుడు విడిపోవడం ఇంకా గొప్ప అని నమ్మించడంలో బాబు కసిగా పనిచేస్తున్నారు. అయితే బీజేపీని బోనులో నిలబెట్టాల్సిన టీడీపీ..తాము కడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మిస్తామనడం బీజేపీని రక్షించడానికి చేస్తున్న రాజకీయ జిమ్మిక్కని సీపీఎం కార్యదర్శి పి.మధు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తామనడం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడమే అవుతుందని పేర్కొన్నారు. రైల్వే జోన్‌ ఏర్పాటు కోసం 4 సంవత్సరాలు కావాలా అని ప్రశ్నించారు. కడప దీక్షలు తుస్సుమన్నాయని ఎద్దేవా చేశారు. విశాఖ రైల్వే జోన్‌ కోసం పోరాడితే మమ్మల్ని అరెస్ట్‌ చేసి..ఇప్పుడు టీడీపీ నాయకులు దీక్షలంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.