విపక్షాలకు చెంపపెట్టు

5

– రెండేళ్ల పాలనపై ప్రజా తీర్పు

– అనవసర విమర్శలు చేస్తే కేసులు పెడతాం జాగ్రత్త

– పాలేరు గెలుపు మహా విజయం

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మే19(జనంసాక్షి): వరుస ఎన్నికల విజయాలతో టిఆర్‌ఎస్‌ విధానాలకు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు అండగా ఉంటున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అభిప్రాయపడ్డారు. పాలేరు విజయంతో ఇది మరోమారు స్పష్టం అయ్యిందని అన్నారు. ఈ ఫలితాలతో అయినా విపక్షాలు తమ పంథా మార్చుకోవాలని సిఎం కెసిఆర్‌ సూచించారు.  ప్రజా సమస్యలపై పోరాడండి తప్పుకాదు.. కానీ ప్రభుత్వంపై దాడి చేయడం మంచి పద్ధతి కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తాను సీఎం అయిన ఐదో రోజు నుంచి నేటి వరకు కొన్ని సందర్భాలలో ఎవరికీ వారుగా, సామూహికంగా తనపై పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పిచ్చి ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. అభివృద్ధికి అడ్డు పడుతున్న విపక్షాలకు పాలేరులో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. ఇకముందు అనవసర ఆరోపణలు చేస్తే అందుకు కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. తుమ్మల నాగేశ్వరావును భారీ మెజార్టీతో గెలిపించిన పాలేరు నియోజకవర్గ ప్రజలకు  ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. పాలేరులో ఇప్పటి వరకు 25వేలకు పైగా ఆధిక్యంతో ఎవరూ గెలవలేదు… తుమ్మల 45 వేల పైచిలుకు మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారని అభినందించారు. ఇందుకు తెరాస అనుసరించిన విధానాలు, కార్యక్రమాలు, మంత్రి తుమ్మలకు ఉన్న ట్రాక్‌ రికార్డు కూడా కారణమన్నారు. నారాయణఖేడ్‌, పాలేరుల్లో సానుభూతికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. ఇదంతా రెండేళ్ల తెరాస పాలనను సవిూక్షించి ప్రజలు ఇచ్చిన తీర్పు అని పేర్కొన్నారు. 2014లో పాలేరులో తెరాస పోటీచేస్తే 4,100 ఓట్లు మాత్రమే వచ్చాయి.. తాజాగా 96వేల పైచిలుకు ఓట్లు వచ్చాయని ఇది మామూలు విషయం కాదన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలకు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు తెరాసకు మద్దతు ప్రకటించారని, ఈ విజయం తమ ప్రభుత్వం, పార్టీపై మరింత బాధ్యత పెంచిందన్నారు.

తెరాస అధికారంలోకి వచ్చిన ఐదో రోజు నుంచే విపక్షాలు అసత్యప్రచారం మొదలుపెట్టాయని విమర్శించారు. అధికారులపై అసత్య ఆరోపణలు చేసి లోకేశ్‌కుమార్‌ వంటి మంచి కలెక్టర్‌ను మార్పించారు. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, రిటర్నింగ్‌ అధికారిని మార్చారు, అయినప్పటికీ ప్రజలు సరైన తీర్పునిచ్చారు. ఐఏఎస్‌ అధికారి లోకేశ్‌కుమార్‌ను 2014 ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ది బెస్ట్‌ రిటర్నింగ్‌ అధికారిగా గౌరవించింది. లోకేశ్‌కుమార్‌ను కూడా తప్పించారు. ఈవీఎంల విూద అనుమానం వ్యక్తం చేశారు. ఓటింగ్‌ విషయంలో వీవీ ప్యాట్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని విపక్షాలు కోరుకున్నట్లే జరిగాయి. మరి ఫలితం మాత్రం టీఆర్‌ఎస్‌కు దక్కింది. విపక్షాలు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ఖమ్మంలో ముఠా కట్టిన కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. ఓటర్లను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి కాంగ్రెస్‌ భంగపడిందన్నారు. అధికారులను మార్పించినా ప్రజలు వేసిన ఓట్లకు కాంగ్రెస్‌ చెప్పే సమాధానమేంటని ప్రశ్నించారు. వరుసగా మెదక్‌, వరంగల్‌ ఉప ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికలు కూడా టిఆర్‌ఎస్‌కు విజయం సాధించి పెట్టాయ్నారు. ఇవన్‌ఈన కూడా ప్రజలు టిఆర్‌ఎస్‌కు అండగా ఉన్నామని చెప్‌ఇపనవేనని అన్నారు. ఇప్పటికైనా అసత్యప్రచారం మానుకుని నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ప్రతిపక్షాలను కోరారు. తమ పాలనకు దేశ ప్రధాని సహా అనేక సంస్థల నుంచి అభినందనలు వచ్చాయని తెలిపారు. సంక్షేమ

పథకాల అమలులో కేంద్రం కంటే తెలంగాణ ముందు ఉందని ప్రధానితో భేటీలో చెప్పామని తెలిపారు. అవినీతి రహిత ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని దేశ వ్యాప్తంగా చెబుతున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ఇప్పటికీ 1947 నాటి రాజకీయాలు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలు చేస్తే కేసులు పెట్టేందుకైనా వెనుకాడబోమని ప్రకటించారు. అవినీతి రహితంగా పని చేసే ప్రభుత్వం ఉందంటే అది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం ఏ పని మొదలు పెట్టినా అవినీతి అని అనడం సరికాదన్నారు. దాడి చేయడమే రాజకీయం అనుకోవడం అవివేకమన్నారు. పాలేరు తీర్పుతోనైనా విపక్షాలకు కనువిప్పు కలగాలన్నారు. గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌ పాలనను సవిూక్షించి ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నాం. విూ వెంట ఉన్నాం అని ప్రజలు బల్లగుద్ది ఇచ్చిన తీర్పు ఇది. ప్రభుత్వ పాలనను ప్రజలు మెచ్చారు అనడానికే ఈ గెలుపే నిదర్శనం. ఏ ఎన్నికైనా కావొచ్చు.. టీఆర్‌ఎస్‌దే గెలుపు. ప్రజలు ప్రభుత్వానికి నిరంతరమైన మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ గెలుపు ప్రభుత్వం, పార్టీపై బాధ్యత పెంచింది. గెలిచినంత మాత్రాన గర్వం రావొద్దు. సంస్కారంతో ముందుకెళ్లాలి. ప్రజలకు మేలు చేకూరేలా పనులు చేయాలన్నారు. ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. గెలిచినంత మాత్రాన ఉబ్బిపోయి అతి ప్రసంగాలు చేయకూడదు. సంస్కారం ఉండాలి, మరింత అంకిత భావంతో పనిచేయాలన్నారు.