విపక్షాలది అనవసర రాద్ధాంతం:ఎంపి

ఆదిలాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమాన స్థాయిలో కొనసాగుతోందని ఆదిలాబాద్‌ ఎంపీ గొడం నగేష్‌ అన్నారు. విద్య, ఆరోగ్యంపై తెరాస ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులతో పాటు అదనంగానూ రాబడుతామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమపథకాలు పార్టీలకతీతంగా అమలు చేసి ప్రవేశపెడుతున్నదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధే లక్ష్యంగా, బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకెళ్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆసరా, వితంతు, బీడీ కార్మికుల జీనభృతి, తదితర పథకాల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.29 వేల కోట్ల నిధులను వెచ్చిస్తోందని చెప్పారు. మిషన్‌కాకతీయ పథకం గ్రావిూణ రైతన్నలకు వరం లాంటిదన్నారు. మిషన్‌ భగీరథ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే గ్రావిూణ ప్రజలందరికీ తాగునీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను చూసి ఓర్వలేకనే విపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని మండిపడ్డారు.

 

తాజావార్తలు