విభజన చట్టాన్ని అమలు చేయండి
ప్రత్యేక ప్యాకేజీ, పన్ను మినహాయింపులు,
కాకతీయ మిషన్‌కు ప్రోత్సాహకాలపై..
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం కేసీఆర్ సమావేశం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జనంసాక్షి): ఐదురోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్టాన్రికి ప్రత్యేక ప్యాకేజీ, పన్ను మినహాయింపులను కేసీఆర్ కోరారు. పెండింగ్‌లో ఉన్న పలు ఆర్థిక అంశాలపై చర్చించారు. జలజాలం, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు కోరారు. అలాగే పన్నుల్లో మినహాయింపులు ఇవ్వాలని అన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన భేటీ ముగిసింది. ఈ సమావేశంలో సీఎంతో పాటు ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, వినోద్‌లు పాల్గొన్నారు. కేంద్రం నుంచి రాష్టాన్రికి రావాల్సిన నిధులపై చర్చ. రాష్టాన్రికి ప్రత్యేక ప్యాకేజీ, పన్ను మినహాయింపులు పునర్విభజనచట్టం ప్రకారం కల్పించాలని సీఎం కోరారు. అదేవిధంగా మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు కోరినట్లు సమాచారం. రాష్టాన్రికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీతో ప్రస్తావించారని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. సీఎంతోపాటు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఆయన ఉన్నారు. అనంతరం మాట్లాడుతూ… ‘బకాయిలను మూడేళ్లలో చెల్లిస్తామని జైట్లీ తెలిపారు. హెచ్‌ఎండీఏ హౌసింగ్ బోర్డు పన్నులను మాఫీ చేయాలని సీఎం కోరారు. టెక్స్‌టైల్స్ క్లస్టర్స్ కోసం బడ్జెట్‌లో నిధులను కేటాయించాని కేసీఆర్ విజ్ఞప్తి చేశారన్నారు. . కేంద్ర, రాష్టాల్ర మధ్య సంబంధాలు బాగుండేలా కొత్త ఒరవడితో బడ్జెట్ ఉంటుందని ఆరుణ్‌జైట్లీ స్పష్టం చేశారని అన్నారు. రాష్టాల్రు కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రధాన మంత్రి జీఎస్‌టీ విధానం తెస్తున్నారని, జీఎస్‌టీ ద్వారా లబ్ది పొందే రాష్టాల్ల్రో తెలంగాణ కూడా ఉంటుదని జైట్లీ తెలిపారు’ అని వినోద్ వివరించారు. తాము కూడా వివిధ పథకాలు, విబజన సందర్భంగా రావాల్సిన నిధులు తదితర అంశానలు ప్రతిపాదించామని అన్నారు. అధికార ప్రతినిధి వేణుగోపాలచారని కూడా ఆయన వెంట ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిని కేంద్ర మంత్రి దత్తాత్రేయ కలిశారు. వచ్చే బడ్జెట్ లో కార్మిక శాఖకు ఎక్కువ నిధులు కేటాయించాలని కోరాడం జరిగిందని దత్తాత్రేయ తెలిపారు. కొత్తగా ప్రవేశ పెట్టనున్న కార్మిక చట్టాలపై జైట్లీకి వివరించడం జరిగిందన్నారు. బాల కార్మికుల చట్టం, చిన్న పరిశ్రమల చట్టం, ఈపీఎఫ్ చట్టాలపై వివరించడం జరిగిందని దత్తాత్రేయ తెలిపారు.
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ బిజీ
ఐదు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఆదివారం నీతి ఆయోగ్ సిఎంల సమావేవంలో పాల్గొననున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, వివిధ పథకాలపై ప్రధానితో చర్చిస్తారు. ఆదివారం ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజు పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని విన్నవించారు. ఇప్పటికే బయ్యారం ఫ్యాక్టరీపై కేంద్ర బృందం నివేదిక సమర్పించిందని… అందులో రాష్టాక్రి సంబంధించి పరిశీలించాల్సిన అంశాలున్నాయని తోమర్ తెలిపారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసిన పర్యవేక్షక కమిటీ రెండు నెలల్లో కేంద్రానికి నివేదిక ఇస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిశారు.నల్లగొండ
జిల్లాలో 7500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతులు, గ్రీన్ కారిడార్ ఏర్పాటుకు నిధులు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ ¬దా అంశాలపై చర్చించారు. దీనిపై ప్రకాష్ జవదేకర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అనంతరం కొత్తగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన హెచ్ ఎస్ బ్రహ్మతో సమావేశమయ్యారు కేసీఆర్. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్ వ్యవస్థీకరించి.. 153కు పెంచే అంశాలపై ఆయనతో చర్చించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జెపీ నడ్డాతో భేటీ అయిన కేసీఆర్… తెలంగాణలో ఎయిమ్స్ తరహా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో విస్తరిస్తున్న స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకుంటున్న చర్యలపై వివరించారు.