విలీనం ప్రక్రియ పూర్తయింది ప్రభుత్వ చర్యలు చేపట్టాలి : వికాస్ మంచి డిమాండ్

కంటోన్మెంట్ జనం సాక్షి ఆగష్టు 01 కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఆధ్వర్యంలో లీ పాలస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వికాస్ మంచి అధ్యక్షుడు గడ్డం ఏబిల్, సంకి రవీందర్ మాట్లాడుతూ
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఐ.టి.మరియు మున్సిపల్ శాఖామంత్రి కె.టి.రామారావు,తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి,స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎమ్ఏయుడి అరవింద్,అదనపు సెక్రెటరీ వి.సైదా కలిసి కంటోన్మెంట్ విలీన అనంతరం కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కొరకు తీసుకోవలసిన చర్యలపై వినతి పత్రం అందించినట్టు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందజేయడంతో పాటు రెండు పడక గదుల ఇల్లు కేటాయించి జిహెచ్ఎంసిలో అమలవుతున్న టౌన్ ప్లానింగ్ విధానాన్ని కూడా అమలు పరచాలని కోరుతూ 18 ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందజేశారు.జిహెచ్ఎంసి లో కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని, ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.విలీన అనంతరం కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కొరకు ప్రభుత్వం అన్ని రంగాలలో ప్రత్యేక చొరవ తీసుకొని ముందుకు సాగాలని అంటున్నారు. జిహెచ్ఎంసిలో కంటోన్మెంట్ ప్రాంత విలీన ప్రక్రియలో భాగంగా ప్రత్యేక సర్కిల్ గా ప్రకటించి కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి 25వేల కోట్ల స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలని కంటోన్మెంట్ వికాస్ మంచి డిమాండ్ చేసింది.కంటోన్మెంట్ జూబ్లీ బస్ స్టేషన్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో రైలు ప్రాజెక్టును,ఇండోర్ స్టేడియం, క్రీడా మైదానాలు, అభివృద్ధి చేయాలి.కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చార్జీలు 11% నుండి 7.5%కి తగ్గించాలి అన్ని అలాగే కంటోన్మెంట్ ప్రాంత పౌరుల కోసం ఉన్నత విద్యా సంస్థలను,పేద ప్రజలకు వైద్య సదుపాయాలుకల్పించాలికోరారు.కంటోన్మెంట్ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్,జమీల్, ప్రభు గుప్తా, శ్యాంసన్ రాజ్,బాలస్వామి,ఇటుక గోపి, అరుణ్ యాదవ్, బొట్టు ప్రభాకర్, వెంకటేష్, శ్రీనివాస్, సులేమాన్, నరేష్ ముదిరాజ్, నాగినేని సరిత, గడ్డి పద్మావతి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

తాజావార్తలు