వివాదాల్లో క్రికెట్‌ ఆటగాళ్లు


కోల్‌కతా, మే 5(జనంసాక్షి) : రాజస్థాన్‌ రాయల్స్‌ కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచులో సీనియర్‌ ఆటగాడు రాహుల్‌ ద్రావిడ్‌తో గొడవకు దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సాదథి గౌతమ్‌ గంభీర్‌పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్లను గౌరవించని ఇలాంటి ప్రవర్తన గంభీర్‌కు సరికాదని ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడెజా సూచించాడు. గంభీర్‌ నీవు మ్యాచ్‌ గెలిచి ఉండవచ్చు కానీ కోట్లాది మంది క్రికెట్‌ అభిమానుల గౌరవాన్ని కోల్పోయావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని నీవు తిరిగి సాధించలేవు అన్నాడు. ఓ విధంగా నీకున్నా విరాట్‌ కోహ్లీయే నయమని, అతడు కనీసం తనకన్నా సీనియర్లను గౌరవిస్తాడన్నారు. బంతిని సరిగా క్యాచ్‌ కూడా పట్టుకోలేని బిస్లా ద్రవీడ్‌తో గొడవకు దిగడం ఘోరమన్నాడు. క్రికెట్‌ జెంటిల్‌మెన్‌ గేమ్‌ అయితే ద్రవిడ్‌ జెంటిల్‌మెన్‌ అని తన ట్విట్టర్‌ పేజీలో ట్వీట్‌ చేశాడు. స్పీన్‌ లెజెండ్‌ షేన్‌ వార్న సైతం గంభీర్‌ ప్రవర్తనపై ఆశ్చర్యం ప్రకటించాడు. క్రికెట్‌ అభిమానులకు ఓ ప్రశ్న ప్రపంచంలోని అత్యంత చికాకుపెట్టే టాప్‌ 3ఆటగాళ్లలో గంభీరా కూడా? అంటూ ట్వీట్‌ చేశాడు.
గంభీర్‌ వివరణ
మ్యాచ్‌ సందర్భంగా జరిగిన గొడవపై గంభీర్‌ దిద్దుబాటు చర్యలకు దిగాడు. అసలు ద్రవీడ్‌కు తనకు మధ్య ఎలాంటి గొడవ జరగలేదని అతడంటే ఎంతో గౌరవముందని ఫ్రెండ్స్‌ మీరనుకుంటన్నది తప్పని తనకు ద్రవిడ్‌ బాయ్‌కు మధ్య మాటల యుద్ధం జరగలేదన్నాడు. జట్టు సభ్యుడిగా ఇంతకుముందు భవిష్యత్తులో కూడా అతడిని గౌరవిస్తుంటానన్నాడు. వివాదం లేదన్నాడు.
అసలు గొడవేంటి?
శుక్రవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌. రాజస్థాన్‌ రాయల్స్‌కు మధ్య మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు కోల్‌కతా ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో తొలుత ఓపెనర్‌ బిస్లా రాజస్థాన్‌ ఆల్‌రౌండర్‌ వాట్సన్‌ మాటల యుద్ధానికి తెరలేపారు. బిస్లాను శాంతింపజేసేందుకు ద్రావిడ్‌ ప్రయత్నించగా ముందు వాట్సన్‌కు చెప్పుకోమని ద్రావిడ్‌కు ఘాటుగా సూచించాడు. ఆ సమయంలో నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న గంభీర్‌ జోక్యం చేసుకోవడంతో వాతావరణం మరింత వేడేక్కింది. ఆ మరుసటి ఓవర్లో స్టంపవుటయిన గంభీర్‌ పెవిలియన్‌కు వెళ్లేముందు ద్రావిడ్‌తో వాదులాటకు దిగాడు. ఆంపైర్‌ జోక్యం చేసుకొని ఉద్రిక్తతను తగ్గించారు. ఇందులో ద్రావిడ్‌ తప్పేమి లేదు.
వాట్సన్‌ బిస్లాకు బౌలింగ్‌ చేసి ఫీల్డ్‌ చేసి బంతిని అందుకున్నాడు. ఆ బంతికి పరుగు రాలేదు. వాట్సన్‌ బంతిని అందుకున్న తర్వాత బిస్లా వైపు నివ్వెరపోయి చూశాడు. ఆ సంఘటనపై ఓవరు ముగిసి మరో ఓవరు ప్రాంరభమయ్యే సమయంలో గంభీర్‌, బిస్లా, ద్రావిడ్‌ను లక్ష్యం చేసుకున్నారు. తన ఫీల్డింగ్‌ స్పాట్‌లోకి వెళ్తున్న ద్రావిడ్‌పై గంభీర్‌, బిస్లా కఠిన పదజాలం విసిరారు. ద్రావిడ్‌ వైపు బిస్లా చేతులు చూపిస్తూ ఏదో అన్నాడు. గంభీర్‌ ద్రావిడ్‌ను దూషించాడు. రహనే వచ్చి బిస్లాను వెనక్కి లాగాడు. ఇంతలో ఆంపైర్‌ కుమార్‌ దర్మసేన జోక్యం చేసుకున్నాడు. ఈ సమయంలో వాట్సన్‌ తన వాట్సన్‌ తన ఫీల్డింగ్‌ చోటు నుంచి ఏదో అన్నాడు. కాగా ఇంతకుముందు బెంగళూర్‌, కోల్‌కతా మ్యాచ్‌ సందర్భంగా కెప్టెన్లు ఢిల్లీ సహచరులు కోహ్లీ , గౌతీ అనుచితంగా ప్రవర్తించారు.