వివాహాలు మరియు చైల్డ్ లైన్ 1098 సేవల పై అవగాహన కార్యక్రమం

అయిజ,జులై 22(జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలో మండల స్థాయి అడ్వైజర్ బోర్డు సమావేశం ఎం. ఏ. బి, ఐజ మండలం, ఎమ్మార్వో యాదగిరి  ఆధ్వర్యంలో , కమిట్మెంట్స్ సంస్థ   మహిళ శిశు సంక్షేమ శాఖ  చైల్డ్ లైన్ 1098  సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం లో చైల్డ్ లైన్ టీమ్ నెంబర్ కృష్ణ మాట్లాడుతూ మాట్లాడుతూ  బాల్య వివాహాలు మరియు చైల్డ్ లైన్ 1098 సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడo జరిగింది.ఆడపిల్లల రక్షణ,చదువు,ఆడపిల్లలపై వివక్ష ,బాల్య వివాహాలు, . ఇందులో  బాల్య వివాహాల నష్టాలు, బాలకార్మికులు, సెల్ ఫోన్ వల్ల అనార్థాలు, శారీరక ఎదుగుదలలో మార్పులు ,వ్యక్తిగత పరిశుభ్రత, గురించి తెలియజేయడం జరిగింది. అలాగే బడికి వెళ్లకుండా ఎవరైనా పని చేస్తున్నట్లు కనిపిస్తే వెంటెనే1098 ఫోన్ చేయమని చెప్పడం జరిగింది.బాల్య వివాహం చేయడం వల్ల చాలా రకాల సమస్యలు రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది.మరియు 18 సంవత్సరాలలోపు పిల్లలకు ఎటువంటి సమస్య ఉన్న, ఏ సమయంలోనైనా, 1098 కి ఫోన్ సమాచారం ఇవ్వాలని అన్నారు. సిడిపిఓ ,కమలాదేవి , సూపర్వైజర్ యమిలి మేడం, కేజీబీవీ ఎస్ ఓ, హెచ్ ఇ ఎఫ్ , ఎంపీడీవో సూపర్డెంట్, ఏఎస్ఐ పోలీస్ , ఏపీవో , ఏబీఎన్ , జడ్.పి.హెచ్. ఎస్, యుపిఎస్ స్కూల్, ఐకెపిఎంఎంఎస్, ఆర్ ఐ, తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Attachments area