వివాహిత దారుణ హత్య
అమ్రాబాద్: మండలంలోని పదర గ్రామంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురయింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కడారి లింగమ్మతో అదే గ్రామానికి చెందిన పెద్ద అంజనేయులు కోంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరి మద్యతరచూ గోడవలు జరుగుతున్నాయి.ఈ నేపద్యంలో శుక్రవారం ఉదయం పోలానికి విళ్లిన లింగమ్మను అంజనేయులు నరికి చంపినట్లు అమ్రాబాద్ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.