వివాహేతర సంబంధంతో వ్యక్తి దారుణ హత్య

51466220085_625x300

ఏటూరునాగారం: వివాహేతర సంబంధం ఓ యువకుడి దారుణ హత్యకు దారి తీసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం ఆకుల వారి గణపురానికి చెందిన కేతిరి రమేశ్(23) అనే యువకుడు కొంతకాలంగా తన వదినతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

దీంతో ఆమె మామ కేతిరి సమ్మయ్య(55) రమేశ్ను శనివారం ఉదయం గ్రామంలోని చెరువు సమీపంలో గొడ్డలితో నరికి చంపాడు. సమ్మయ్య, మృతుడికి సొంత పెదనాన్న. రమేశ్‌ను చంపిన అనంతరం సమ్మయ్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. సమ్మయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.