వివేకానంద యూత్ అసోసియేషన్ వినాయకుని కి డిటిఓ ఎర్రి స్వామి ప్రత్యేక పూజలు.

యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2వేల మందికి అన్న ప్రసాదం పంపిణీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్7(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కన , ప్రధాన రహదారిపై వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 21వ సంవత్సరం నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు భారీ గణపతికి జిల్లా రవాణాశాఖ అధికారి మఠం ఎర్రిస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు వివేకానంద యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా
జిల్లా రవాణాశాఖ అధికారి మాట్లాడుతూ సామాజిక సేవ లో, పలు ఉత్సవాలలో వివేకానంద యూత్ కమిటీ చురుకుగా పాల్గొని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రని, ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు.23 అడుగుల ఎత్తులో గణపతి వరసిద్ధి స్వామి వారిని విగ్రహ ప్రతిష్ట చేసినట్లు వివేకానంద యూత్ ప్రధాన కార్యదర్శి ఖానాపురం ముకేశ్ తెలిపారు.
60 మంది యువత సభ్యులతో వివేకానంద యూత్ 2001 సంవత్సరం నుండి పలు రూపాలలో వినాయక ప్రతిమలను భారీగా ఏర్పాటు చేసి, తొమ్మిది రోజులపాటు గణపతి పూజ ఉత్సవాలు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు మహిళలచే కోలాటం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వివేకానంద యూత్ అసోసియేషన్ వారిచే ఏర్పాటుచేసిన అన్నప్రసాద పంపిణీని జిల్లా రవాణా అధికారి ఏర్రి స్వామి ప్రారంభించారు.వివిధ కాలనిల ,వివిధ గ్రామాల యువత, భక్తులు 2వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారని నిర్వహకులు తెలిపారు.భారీ గణపతి స్వామి వారిని ప్రత్యేక వాహనంలో గురువారం రోజు సాయంత్రం నుండి నిమజ్జన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్య క్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సి.భాస్కర్ రావు, పట్టణ కౌన్సిలర్ మలిశెట్టి పద్మమ్మ, యూత్ సభ్యులు ఖానాపురం ప్రదీప్ కుమార్, మలిశెట్టి గణేష్, కటిక శివాజీ, ముల్లపాటి సందీప్ రావు, ఖానాపురం ప్రదీప్, కిట్టూ, అల్లిపుర్ రాజేష్, శివ, నాని, పరశురాం, యూత్ సభ్యులు,వారి కుటుంబ సభ్యులు, జర్నలిస్టు లు కొండకింది మాధవరెడ్డి,మలి పెద్ది రమేష్,సందు యాదగిరి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.