విశాఖ స్టీల్‌ కోసం రాజీలేని ఉద్యమం


ప్రజలంతా కలసి రావాలని కార్మికుల పిలుపు
విశాఖపట్టణం,ఆగస్ట్‌19(జనం సాక్షి): స్టీల్‌ప్లాంట్‌ జోలికొస్తే సహించేది లేదని కార్మికు సంఘాల జెఎసి నేతలు హెచ్చరించారు. ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని, మోడీ విధానాలను వ్యతిరేకించాలని అన్నారు. టాటా స్టీల్‌ సీఈవో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ బిడ్డింగ్‌లో పాల్గొంటామని ప్రకటించడం దుర్మార్గమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ఏ ఒక్కరి సొత్తు కాదని, ఇది ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వకుండా ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించారు.
విశాఖ స్టీల్‌ఎª`లాంట్‌ పరిరక్షణ ఉద్యమానికి ముఖ్యమంత్రి నాయకత్వం వహించాలని అన్నారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్‌ చేస్తూ నిరంతరంగా ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం కానరావడం లేదన్నారు. ప్రజా ఉద్యమాన్ని గౌరవించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించారు.