విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యల సాధన కోసం కృషి

అధ్యక్షులు బి.గోపాలం

మక్తల్ జూలై 09 (జనంసాక్షి) విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యల సాధనకై తమ వంతు కృషి చేస్తామని మక్తల్ మండల పెన్షనర్ల సంఘం అధ్యక్షులు బి.గోపాలం, ప్రధాన కార్యదర్శి బి. భాస్కర్ లు అన్నారు. మక్తల్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెన్షనర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణం కొరకు స్థలాన్ని కేటాయించవలసినదిగా మక్తల్ తహసీల్దార్ కు తెలియజేసినట్లు వారు తెలిపారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారికి పెన్షనర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మక్తల్ ఎస్ టి ఓ పరిధిలోని 500 మంది పెన్షనర్స్ ప్రతినెల రెండో శనివారం నిర్వహించే పెన్షనర్స్ సమావేశానికి సభ్యులందరూ తప్పకుండాహాజరు కావాలని కోరారు. వారికి గల సమస్యలను తెలిపినట్లైతే వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఆగస్టు నెల రెండో శనివారము జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పెన్షనర్స్ సమావేశాన్ని నిర్వహిస్తామని, కావున సభ్యులందరూ గమనించాలని వారు తెలిపారు. ఇట్టి సమావేశంలో గౌరవ అధ్యక్షుడు జి నాగప్ప ,బి సంజన ,సూర్య ప్రకాష్, సిద్ధి లింగయ్య, కిష్టయ్య గౌడ్ ,నరసయ్య, తులసప్ప, సుజాత ,విద్యావతి, తిప్పారెడ్డి, గోవింద్ ,దేవన్న, నాగ లింగయ్య ,ఆశన్న, సత్యనారాయణ ,రామచందర్, శ్రీనివాసులు, 30 మంది పెన్షనర్స్ సమావేశానికి హాజరైనట్లు అధ్యక్షుడు బి.గోపాలం తెలిపారు. అలాగే విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ ఫైలింగ్ కొరకు తమ ఆధార్ కార్డు, పాస్బుక్ ఫస్ట్ పేజీ, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలను సమర్పించాలని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు.