విశ్వసుందరి విజేత మిస్ కొలంబియా
హైదరాబాద్,జనవరి26(జనంసాక్షి): ఈ ఏటి విశ్వసుందరి (మిస్ యూనివర్స్) కిరీటాన్ని మిస్ కొలంబియా 22 ఏళ్ల పౌలినా వెగా గెలుచుకుంది. 87 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీపడగా మిస్ యూఎస్‌ఏ నియా సాంచెజ్, మిస్ ఉక్రెయిన్ డయానా హర్కుసాలు రన్నరప్‌లుగా నిలిచారు. బిజినెస్ అడ్మినిస్గేషన్ చదువుతున్న వెగా తాను పాల్గొన్న మొదటి, చివరి పోటీ ఇదేనని, చదువు కొనసాగించడం తనముందున్న లక్ష్యమని పేర్కొంది. అందంతో పాటు సమర్థురాలైన, వృత్తి నిపుణురాలిగా పేరొందడాన్ని ఇష్టపడే నేటి మహిళలకు తాను ప్రతినిధినని వెగా న్యాయనిర్ణేతలకు స్పష్టంచేసింది.